హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. 35 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్‌ను గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపేశారు. ఈ ఘటన బోరబండ వద్ద చోటుచేసుకుంది. బాధితుడిని బోరబండలోని వెంకటగిరి ప్రాంతానికి చెందిన చుక్క చెన్నయ్య అలియాస్ గా గుర్తించారు.
మే 14 మంగళవారం సాయంత్రం పని కోసం బయటకు వెళ్లిన చెన్నయ్య.. బుధవారం ఉదయం శవమై కనిపించాడు. బోరబండలోని ఏకాంత ప్రదేశంలో అతని శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు చెన్నయ్య టీవీ సీరియల్స్ మేకప్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.