అక్టోబర్ 31 లోగా సర్వే నివేదికలు ఇవ్వాలి: సర్వేయర్లకు అడిషనల్​ కలెక్టర్ ​ఆదేశం

అక్టోబర్ 31 లోగా సర్వే నివేదికలు ఇవ్వాలి: సర్వేయర్లకు అడిషనల్​ కలెక్టర్ ​ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 31 లోగా నివేదిక సమర్పించాలని హైదరాబాద్​అడిషనల్​కలెక్టర్(రెవెన్యూ) వెంకటాచారి సర్వేయర్లను ఆదేశించారు. 

మంగళవారం జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసులో జిల్లాలోని అన్ని మండలాల సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. మండల వారీగా సర్వే పనులు, నివేదికలను పరిశీలించారు. ఏ మండలంలోనూ సర్వే పెండింగ్ ఉండకూడదని, దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరమైన సర్వే విధులు నిర్వహించాలని సూచించారు. 31 లోగా అన్ని మండలాల సర్వేయర్లు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. 

సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్రీరామ్, డిప్యూటీ ఇన్​స్పెక్టర్లు రాజేశం, బుచ్చయ్య, మహేందర్ రెడ్డి, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.