హైదరాబాద్ సిటీలో తగ్గిన గాలి కాలుష్యం

హైదరాబాద్ సిటీలో తగ్గిన  గాలి కాలుష్యం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ​సిటీలో గాలి కాలుష్యం తగ్గింది. శనివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 72గా నమోదైంది. సాధారణంగా102 నుంచి 110 వరకు నమోదవుతూ ఉంటుంది.  శనివారం రాత్రి 7 గంటలకు ఎయిర్ క్వాలిటీ 72కు చేరిందని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తెలిపారు. అత్యధికంగా జూపార్క్ ఏరియాలో 101ఏక్యూఐ, అత్యల్పంగా సనత్ నగర్ ఏరియాలో 37 ఏక్యూఐ నమోదైంది. వర్షాలు, వరుస సెలవులతో వెహికల్స్ పెద్దగా రోడ్ల పైకి రాకపోవడంతో పొల్యూషన్ తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.