ప్యాసింజర్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కీలక సూచన

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు ముఖ్య సూచిక చేసింది. ఆగస్ట్ 15 నుంచి వారం రోజులపాటు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. అందుకే విమాన ప్రయాణాలు చేసే వారు ఎయిర్ పోర్ట్ కు ముందుగానే చేరుకోవాని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. రాఖీ పండుగ కారణంగా ప్యాసింజర్లు రద్దీ పెరుగుతుందని ఎయిర్ పోర్ట్ అంచనా వేసింది. ఈమేరకు ఫ్లైట్ సమయానికంటే ముందే బయలుదేరాలని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కు సూచించింది. ఆగస్ట్ 15 నుంచి 19 మధ్య ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో.. వారు ఎయిర్  పోర్ట్ కు ముందే చేరుకొని ఉండాలని కోరింది.