మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ అజూర్‌లో ఏర్పడ్డ సాంకేతిక లోపం కారణంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. దేశంలోని విమానయాన సంస్థలు ఈ సాంకేతిక లోపంతో ప్రభావితం అయ్యాయని తెలిపింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టుపైనా మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ పడింది. బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్ కావటంతో.. బోర్డింగ్ పాసులపై ఈ ప్రభావం పడిందని.. ఫ్లయిట్స్ లేటు అవ్వకుండా.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నట్లు వెల్లడించింది ఎయిర్ పోర్ట్.
Advisory: Due to the global IT outage, services of airlines have been impacted.
— RGIA Hyderabad (@RGIAHyd) July 19, 2024
We are closely working with all our stakeholders to minimise the inconvenience to our flyers.
You may please get in touch with the airline concerned for updates on your flight information.
We…
ప్రయాణికులు తమ విమానాలకు సంబంధించిన సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని తెలిపింది.ఆన్ లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిన క్రమంలో.. ప్రయాణికులు వీలైనంత త్వరగా ఏయిర్ పోర్ట్ కు చేరుకుని చెక్ ఇన్ చేసుకోవాలని సూచించింది.
మరోవైపు ఇండిగో, ఆకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి పలు విమానయాన సంస్థలు ఈ అంతరాయంపై స్పందించాయి. తమ ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశాయి. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా నెట్‌వర్క్ అంతటా తమ సేవలు ప్రభావితమయ్యాయని.. దీని ఫలితంగా ఆన్ లైన్ బుకింగ్, చెక్ ఇన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని పేర్కొన్నాయి.
అంతరాయానికి చింతిస్తున్నామని.. పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. త్వరలోనే సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొన్నాయి. ప్రయాణికులు చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా ఎయిర్ పోర్టుకు చేరుకుని చెక్ ఇన్ చేసుకోవాలని అభ్యర్థించాయి. లేని యెడల భారీగా క్యూలైన్లు ఏర్పడి ప్రయాణానికి ఆటంకంగా మారవచ్చని పేర్కొన్నాయి.