
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటెర్నేషనల్ లో ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మరోసారి అవార్డు లభించింది. 2024 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికులతో బెస్ట్ ఎయిర్ పోర్ట్ గా నిలిచింది శంషాబాద్ ఎయిర్ పోర్ట్.
ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ ప్యాసెంజర్స్ సాటిస్ఫ్యాక్టరి లెవెల్స్ ని కొలవడానికి బెంచ్ మార్క్ గా పరిగణిస్తారు. ఇది విమానాశ్రయాల పరిమాణం, ప్రాంతం, డేడికేటెడ్ స్టాఫ్, ఈజీఎస్ట్ ఎయిర్పోర్ట్ జర్నీ, డేడికేటెడ్ స్టాఫ్, ఎంజాయబుల్, క్లీనెస్ట్ ఎయిర్ పోర్ట్ వంటి అంశాల ఆధారంగా ఎయిర్ పోర్ట్స్ కి ర్యాంకింగ్స్ ఇస్తుంది.
ఈ అవార్డు రావడం పట్ల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సీఈఓ ప్రదీప్. తమ ఎయిర్ పోర్ట్ కి బెస్ట్ రేటింగ్స్ ఇస్తున్న పాసెంజర్స్ కి ఎప్పటికీ రుణపడి ఉంటామని.. అధునాతన టెక్నాలజీని, ఇన్నోవేషన్స్ ని అందిపుచ్చుకుంటూ.. ప్రయాణికులకు బెస్ట్ మెమొరీస్ ఇవ్వడమే తమ లక్ష్యమని అన్నారు సీఈఓ ప్రదీప్.