హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టేట్ అండర్–17 గర్ల్స్క్రికెట్ టీమ్ కు హైదరాబాద్ కు చెందిన అక్షయలక్ష్మి రెడ్డి ఎంపికయ్యారు. స్టేట్ స్కూల్ స్పోర్ట్స్ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన అండర్– 17 టోర్నీ శుక్రవారం ముగిసింది. ఇందులో ప్రతిభ ఆధారంగా వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులను తెలంగాణ స్టేట్ అండర్-–17 జట్టుకు ఎంపిక చేశారు.
వీరు ఫిబ్రవరి 2 నుంచి హర్యానాలో జరిగే నేషనల్ లెవల్అండర్–17 టోర్నీలో పాల్గొననున్నారు. జూబ్లిహిల్స్ భారతీయ విద్యాభవన్స్లో చదువుతున్న అక్షయలక్ష్మి రెడ్డి గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ నుంచి బీటీమ్ కు సెలక్ట్ అయ్యారు.