గచ్చిబౌలి, వెలుగు: కొత్త కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ గురువారం ఘనంగా జరిగింది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ఆఫీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మ్డ్ రిజర్వ్7వ బ్యాచ్ పాసింగ్అవుట్పరేడ్ కార్యక్రమానికి టెక్నికల్సర్వీసెస్ ఏడీజీపీ వివి. శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండోర్సబ్జెక్టులు, అవుట్డోర్ ట్రైనింగ్, ఫైరింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన క్యాడెట్లకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతితో కలిసి అవార్డులు అందజేశారు.
సైబరాబాద్ ట్రైనింగ్ సెంటర్లో మొత్తం 270 మంది క్యాడెట్లు 9 నెలల పాటు శిక్షణ పొందారని, ఇందులో కరీంనగర్‌కు 95 మంది, ఆదిలాబాద్‌కు 63, మెదక్‌కు56, ఖమ్మం జిల్లాకు 56 మంది ప్రాతినిథ్యం వహించనున్నారని సీటీసీ ప్రిన్సిపల్ డీసీపీఎల్ సీ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్: శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని విధి నిర్వహణలో అమలు పరచాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివాదర్ రెడ్డి సూచించారు. మేడ్చల్ పోలీస్ శిక్షణ కాలేజీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 526 సివిల్ కానిస్టేబుళ్ల పాసింగ్అవుట్పరేడ్ సందడి సాగింది. కార్యక్రమానికి ఆయన హాజరై ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు అవార్డులు ప్రదానం చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీసీ రాములు, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.
చార్మినార్: విధి నిర్వహణలో కానిస్టేబుళ్లు అంకితభావంతో పనిచేయాలని హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ పేట్ల బురుజు మైదానంలో కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖల విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 747 మందికి పలు సూచనలు చేశారు. ఐపీఎస్ అధికారిని రక్షిత కృష్ణమూర్తి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మద్దిపాటి శ్రీనివాసరావు, అడిషనల్ డీసీపీలో భాస్కర్, ఆనంద్ పాల్గొన్నారు.
వికారాబాద్: సమాజాన్ని కుటుంబంగా భావించి విధులు నిర్వర్తించాలని హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. వికారాబాద్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 271 మంది కానిస్టేబుళ్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, డీటీసీ ప్రిన్సిపాల్ మురళీధర్, వైస్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, ఇండోర్, ఔట్ డోర్ ఫ్యాకల్టీ సభ్యులు విజయవంతగా ట్రైనింగ్ నిర్వహించారన్నారు.