ఐపీఎల్ 2024 లో భాగంగా మే 02 గురువారం రోజున హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్డేడియం వేదికగా సాయంత్రం 7 గంటలకు సన్ రైజర్స్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచులు జరగగా.. చెరో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్ లో టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ జట్టు ఉండగా.. ఐదో ప్లేస్ లో సన్ రైజర్స్ ఉంది. రాజస్థాన్ టాపార్డర్ భీకరమైన ఫామ్‌లో ఉంది. సన్ రైజర్స్ టాపార్డర్ నిలదొక్కుకుంటే హోంటీమ్‌కు అడ్డే ఉండదు. ఈ క్రమంలో టాపార్డర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చి సన్‌రైజర్స్ గెలుపు బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్ నమోదు అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కాగా ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు సన్ రైజర్స్, రాజస్థాన్ జట్లు నాలుగు మ్యాచుల్లో తలపడగా.. మూడింట్లో సన్ రైజర్స్ గెలవగా.. ఒకే ఒక మ్యాచ్ లో రాజస్థాన్ గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2 వేల 800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంచారు. సెల్ ఫోన్స్ తప్పా ఎలాంటి వస్తువులని స్డేడియం లోపలికి అనుమతించబోమని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే మొత్తం టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను చూసేందుకు క్యూ కట్టనున్నారు అభిమానులు. దాదాపుగా స్టేడియం మొత్తం ఫుల్ అయ్యే అవకాశం ఉంది. భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక పార్కింగ్ సదూపాయలు కల్పించింది హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్.