క్లబ్ హౌస్ లను కరోనా యూనిట్లుగా మారుస్తున్న నగర వాసులు

క్లబ్ హౌస్ లను కరోనా యూనిట్లుగా మారుస్తున్న నగర వాసులు

సిటీలో ముందుకొస్తున్న రెసిడెంట్లు
పర్మిషన్ లేక వినూత్నఆలోచనకు బ్రేక్
ఇప్పటికే ముంబై, నోయిడాలో అమలు
హైదరాబాద్లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్

కరోనా విజృంభణతో హాస్పిటల్ కు వెళ్లలేక ఇబ్బంది పడ్డ ముంబై వాసులు వినూత్నంగా ఆలోచించారు. గేటెడ్ కమ్యూనిటీలో నిరుపయోగంగా ఉండే విశాలమైన క్లబ్ హౌస్లను ఐసోలేషన్ యూనిట్ గా మార్చేశారు. కరోనా సింప్టమ్స్, సస్పెక్టర్స్ అక్కడే క్వారంటెయిన్ అయ్యేలా మెడికల్ ఫెసిలిటీస్ సమకూర్చుకున్నారు.

నోయిడాలో ఒక్కసారిగా కేసులు పెరగడంతో హాస్పిటల్స్ అన్నీ కరోనాపేషెంట్స్ తో నిండిపోయాయి. ట్రీట్ మెంట్ కు బెడ్స్ లేకపోవడంతో జనం అవస్థ పడ్డారు. పరిష్కారంగా అపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న 2 త్రీ బీహెచ్ కే పోర్షన్లను అపార్ట్మెంట్ వాసుల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే వాటిని ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేందుకు బిల్డర్ అంగీకరించారు. రెండ్రోజుల్లో కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్ గా మార్చి ఆక్సిజన్ సిలిండర్, ఓ హెల్త్ అసిస్టెంట్ , ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ అందించేందుకు డాక్టర్ను అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో హాస్పిటల్ వరకూ వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. వెళ్లినా బెడ్లు దొరకని పరిస్థితి. ఇలాంటి టైమ్లో అందుకు పరిష్కారంగా ముంబై, నోయిడా ప్రజలు సరికొత్తగా ఆలోచించారు. ఖాళీగా ఉన్న పోర్షన్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని క్లబ్ హౌస్లు, అమెంటీస్ రూమ్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ సిటీలోనూ వందల సంఖ్యలో ఖాళీగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్లను ఐసోలేట్ సెంటర్లుగా మార్చుకునేందుకు సిద్ధమవుతుండగా, అడ్డొస్తున్న రూల్స్ తో ఆచరణ
సాధ్యమవడం లేదు. సిటీలో వెయ్యికి పైగా గేటెడ్ కమ్యూనిటీలు, అమెంటిస్ రూమ్లతో ఉన్న అపార్మెంట్లు మెంట్లు ఉన్నాయి. నార్మల్ డేస్ లో పార్టీలు, పార్టీ వేడుకలతో సందడిగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం కరోనాతో అవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఓవైపు పెరుగుతున్నకేసులతో హాస్పిటల్లో బెడ్స్ దొరకడం. కార్పొరేట్ హాస్పిటల్స్ చార్జీలను తలుచుకుంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. టెస్ట్ మొదలు బెడ్ వరకు పైస్థాయి పైరవీ ఉంటేనే అందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై, నోయిడా తరహాలో ఖాళీగా ఉన్న క్లబ్ హౌస్లను కరోనా హెల్త్ యూనిట్స్ గా మార్చుకునేందుకు గేటెడ్ కమ్యూనిటీల సంక్షేమసంఘాలు ముందుకొస్తున్నాయి.

రూల్స్  అడ్డు ..
కరోనా హెల్త్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుపడుతున్నాయని గోల్ఫ్ వ్యూ వెల్పేర్ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల తమగేటెడ్ కమ్యూనిటీల్లో ప్రయత్నించగా, బల్దియా అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. నిబంధనలు అలా లేవని ఆపేసినట్లుగా రెసిడెంట్ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతం ఆ క్లబ్ హౌజ్ ఖాళీగానే ఉంది.

బెడ్ల భారం తగ్గే చాన్స్
వాస్తవానికి ఇలాంటి వినూత్న ఆలోచనకు ప్రభుత్వం సహకరించి, మరిన్ని మార్గదర్శకాలు రూపొందించి ప్రోత్సాహించ గలిగితే బెడ్స్ లోటు అనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తక్కువ ఖర్చులో హోం ఐసోలేషన్ పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అత్యవసర వైద్య సేవలు కూడా మరింత త్వరగా అందించొచ్చని మై హోం జేఎన్ఎం వెల్ఫేర్ ప్రెసిడెంట్ రంగారావు తెలిపారు.

హోం క్వారంటైన్ కంటే బెటర్
నలుగురు ఉండే ఇంట్లో ఒక్కరికి కరోనా పాజిటివ్ వస్తే ఆ ఇంట్లోనే స్పెషల్ రూంలో ఉండాల్సి ఉంది. పిట్టగూళ్లలాంటి ఇండ్లల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇంట్లో తిరుగుతుంటే ఒకరి నుంచి ఇంకొకరి వైరస్ వ్యాప్తి చెందడంతోపాటు చివరకు అపార్ట్ మెంట్ వాసులు, చుట్టుపక్కల వాళ్లకూ వైరస్ స్ప్రెడ్ అవుతోంది. జియాగూడలోని ఓ అపార్ట్మెంట్ లో 26 మంది కరోనా బారిన పడడమే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి సందర్భాల్లో ఖాళీగా ఉన్న క్లబ్ హౌస్లు కరోనా హెల్త్ యూనిట్స్ గా పనికొస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఎవరికీ, ఎలాంటి సమస్యా ఉండదని, వైరస్ స్ప్రెడ్ అవకుండా కంట్రోల్ చెయ్యడానికి వీలవుతుందని కోకాపేట్ లోని గేటెడ్ కమ్యూనిటీ వెల్ఫే ర్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. హోం క్వారంటైన్ కంటే ఎంతో బెటర్ అని చెప్పుకొచ్చారు.

For More News..

ఎన్నికల రోడ్లు 6 నెలలకే ఖరాబ్

ఉస్మానియాను కూల్చేందుకు స్కెచ్!

ఆర్టీఏలో..ఇంటి నుంచే మరో 5 సేవలు