అప్పా జంక్షన్ –మన్నెగూడ హైవే పనులు షురూ

అప్పా జంక్షన్ –మన్నెగూడ హైవే  పనులు షురూ

 

  • మూడేండ్ల కింద టెండర్​ ఫైనల్.. ఎన్జీటీలో కేసుతో స్టార్ట్​కాని వర్క్స్​
  • ఇటీవల మేజర్​ యాక్సిడెంట్ లో పబ్లిక్ మృతి 
  • వెంటనే పనులు స్టార్ట్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
  • రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని గడువు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ( అప్పా జంక్షన్ ) నుంచి మన్నెగూడ వరకు  ఎన్ హెచ్ –163 రోడ్డు విస్తరణ పనులు  స్టార్ట్ అయ్యాయి. ఈ టెండర్ ను మూడేండ్ల కింద  మేఘా కంపెనీ దక్కించుకోగా, రోడ్డు విస్తరణలో భాగంగా 900 భారీ  చెట్లను రీ లొకేట్ చేసే అంశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో కేసు నమోదైంది. దీంతో ఇంత కాలం పనులు స్టార్ట్ కాలేదు. ఈ  కేసు ను క్లియర్ చేసే అంశంపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో  పనులు ఆగినట్టు విమర్శలున్నాయి.  తాజాగా, ఎన్జీటీలో కేసు క్లియర్ కావడంతో హైవే విస్తరణ పనులను మేఘా కంపెనీ స్టార్ట్ చేసింది. 

ఫుల్ ట్రాఫిక్.. ప్రమాదాలు

హైదరాబాద్‌‌ నుంచి కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్‌‌ వరకు వెళ్లే జాతీయ రహదారి పొడవు 365 కిలోమీటర్లు కాగా.. పోలీస్ అకాడమీ జంక్షన్ ( అప్పా ) నుంచి మన్నెగూడ వరకు 46 కిలో మీటర్ల వరకు సింగిల్‌‌ రోడ్డు ఉన్నది. ఈ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు కేంద్రమంత్రి గడ్కరీ మూడేండ్ల క్రితం శంకుస్థాపన చేసినా.. పనులు స్టార్ట్ కాలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మూడేండ్లుగా బీజాపూర్‌‌ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్‌‌ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్‌‌ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వీకెండ్ లో   అయితే అప్పా జంక్షన్‌‌ నుంచి మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్‌‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌‌లకు ట్రాఫిక్‌‌ సమస్య ఎదురవుతున్నది. కాగా, ఈ నెల 3న  ఆలూరులోని చేవెళ్ల రహదారిపై వేగంగా వచ్చిన లారీ.. కూరగాయల వ్యాపారులపై నుంచి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఎన్ హెచ్ -– 163 పై అప్పా  జంక్షన్‌‌ నుంచి మన్నెగూడ మధ్య రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరుతూ స్థానికులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు  చేవెళ్ల--–బీజాపూర్‌‌ రహదారిపై ఆందోళనకు దిగారు.  

46 కిలో మీటర్లు.. 921 కోట్లతో విస్తరణ

46 కిలో మీటర్ల రోడ్డును 4 వరుసలుగా 60  మీటర్ల వెడల్పుతో  హామ్ పద్ధతిలో సుమారు రూ. 921.49  కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. 46 కిలోమీటర్ల పరిధిలో 6 భారీ, 8 ప్రాంతాల్లో చిన్న అండర్‌‌పాస్‌‌ బ్రిడ్జిలను నిర్మించి, అందుబాటులోకి తీసుకురానున్నారు. బైపాస్‌‌ రోడ్లను కూడా నిర్మించేందుకు ప్లాన్‌‌ చేశారు. రెండు బైపాస్‌‌ రోడ్లు కూడా జిల్లాలోనే నిర్మించనున్నారు. మొయినాబాద్‌‌ వద్ద 4.35 కిలోమీటర్ల మేర, చేవెళ్ల వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్‌‌ రోడ్లను నిర్మించనున్నారు. “ ఎన్ హెచ్ –163 హైదరాబాద్ – మన్నెగూడ సెక్షన్ పనుల అగ్రిమెంట్ జరిగి మూడేండ్లు అవుతుంది. కానీ పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఎప్పుడు రివ్యూ చేసిన బన్యన్ ట్రీస్ రిలోకేషన్, ఎన్జీటీ కేసు గురించి చెబుతూ తప్పించుకుంటున్నారు.  అక్కడ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు.  92శాతం భూసేకరణ పూర్తయింది. 46 కిలోమీటర్ల రహదారిలో 4,5 కిలోమీటర్లు సమస్య ఉంటే మొత్తం రోడ్డు నిర్మాణం పెండింగ్ లో పెడితే ఎట్లా? నిర్మాణానికి ఇబ్బందులు లేని ప్రాంతంలో రోడ్డు పనులను ప్రారంభించండి” అని ఇటీవల ఆర్ అండ్ బీ రివ్యూలో ఎన్ హెచ్ ఏ ఐ అధికారులకు ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.  ఈ నేపథ్యంలో పనులు స్టార్ట్​అయి.. చకచకా కొనసాగుతున్నాయి. రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.