హైదరాబాద్ లో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్పనులు 2021లో ప్రారంభం కాగా, గతేడాది నుంచి స్పీడప్చేశారు. అంచనా వ్యయం రూ.636.80 కోట్లు కాగా, పూర్తయ్యే సరికి రూ.736 కోట్లకు చేరింది.
ప్రత్యేక రాష్ట్రంలో పొడవైన ఫ్లైఓవర్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటీలో నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే కానున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ వే 2009లో అందుబాటులోకి వచ్చింది. ఇది11.66 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ దేశంలోనే నెంబర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఎయిర్ పోర్టుకు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. నేటికీ ఫోర్ వీలర్స్ కు మాత్రమే అనుమతి ఉంది. హెవీ వెహికల్స్, టూవీలర్స్, ఆటోలకు పర్మిషన్లేదు. ఆ తర్వాత కొత్తగూడ ఫ్లైఓవర్ ను 3 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మించారు.
అతిత్వరలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లలో అందుబాటులోకి రానుంది. ఇది నగరంలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ స్థానాన్ని దక్కించుకోనుంది. ఫ్లైఓవర్ పనులను హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి బల్దియా కమిషనర్ ఇలంబరితి మంగళవారం పరిశీలించారు. నాలుగు రోజుల్లో అన్ని పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్డు నిర్మాణానికి 17 ఆస్తులు సేకరించాలని, ప్రస్తుతం పని జరిగేందుకు 5 ఆస్తులు వెంటనే సేకరిస్తే సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని చీఫ్ ఇంజనీర్ దేవానంద్ కమిషనర్ కు వివరించారు. నష్టపరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలను పంపిస్తే, మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
జర్నీ ఇక ఈజీ..
ALSO READ : గృహ ప్రవేశం చేసిన రోజే ప్లాట్‌లో మంటలు..మణికొండలోని ఓ హైరైజ్ టవర్స్ లో ఘటన
ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 24 మీటర్ల వెడల్పు, 4.08 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో నిర్మించారు. అందుబాటులోకి వస్తే జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లేవారికి ట్రాఫిక్ఇబ్బందులు తప్పుతాయి. తాడ్బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పనిలేదు. జూపార్క్‌కు వచ్చే సందర్శకులు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవుతుంది.