మెడికల్ అండ్ లైఫ్ సైన్స్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

మెడికల్ అండ్ లైఫ్ సైన్స్ హబ్ గా హైదరాబాద్ :  మంత్రి శ్రీధర్ బాబు

మెడికల్ అండ్ లైఫ్ సైన్స్, ఆర్ అండ్ డీ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని, రాబోయే కలం లో ఐటి, ఫార్మా, లైఫ్ సైన్స్ పరిశ్రమలను ప్రోత్సహకాన్ని అందించేందుకు  విధాన పరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నానాక్ రామ్ గూడా లో  మెడిట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడ్ ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ సెంటర్ లాంటి మల్టీ నేషనల్ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్రనికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనం గా ఈ గ్లోబల్ సెంటర్ నిలిచిందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా 60మిలియన్ డాలర్లు పెట్టుబడులతో, 300 ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని తెలిపారు. 

ఫిబ్రవరిలో మొదలు పెట్టి, ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టబోతోందని వెల్లడించారు. హైదరాబాద్ లో 12 నెలలు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఇనిషివేటీస్ తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని పెట్టుబడులకు ముందు కు వచ్చేస్ కంపెనీ లకు తమ ప్రభుత్వ అన్ని విధాలా ప్రోత్సహం అందిస్తుందని చెప్పారు. హైద్రాబాద్ లో మరిన్ని సంస్థలు పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర్ బాబు.