శేరిలింగంపల్లిలో 80 అక్రమభవనాలకు నోటీసులు

శేరిలింగంపల్లిలో  80 అక్రమభవనాలకు నోటీసులు
  • 22 భవనాలు సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గచ్చిబౌలి డివిజన్ టీఎన్జీఓ కాలనీ, కొండాపూర్ డివిజన్ సిద్దిఖీ నగర్, అంజయ్య నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేయడంతోపాటు 22 భవనాలను సీజ్ చేశారు. నాలుగు నెలల కింద సిద్దిఖినగర్​లో 5 అంతస్తుల్లో అక్రమంగా నిర్మించిన భవనం కుంగిపోయిన ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్దిఖీ నగర్, అంజయ్య నగర్ లోని16, టీఎన్ జీవో కాలనీ లో మరో 6  బహుళ అంతస్తు భవనాలను సీజ్ చేశారు.

 ఇందులో కొన్ని వారం కింద సీజ్ చేయగా, ఇంకొన్ని గతనెలాఖరులో సీజ్ చేశారు. ఇలా మొత్తం  80 భవనాలను నోటీసులు జారీ చేశారు. ఒక్కో భవనానికి మూడుసార్లు నోటీసులు జారీ చేసి, స్పందించకుంటే భవనాలను సీజ్ చేస్తున్నారు. అయితే కొన్నింటికి సంబంధించి మాముళ్లు తీసుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.