శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

 కేరళలోని శబరిమలలో రోడ్డు ప్రమాదం జరిగింది.  హైదరాబాద్ కు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు పంబా నదికి కొద్ది దూరంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు అక్కడిక్కడే మృతి చెందగా మరో 8 మంది స్వాములకు తీవ్ర గాయలయ్యాయి. మరో 22 మందికి స్వల్పగాయాలయ్యాయి.   

ఘాట్ రోడ్డులోని మలుపు దగ్గర  అదుపు తప్పి  చెట్లపై ఒరగడంతో  పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. గాయాలైన వారిని  కొట్టాయం మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.