తిక్క కుదిరింది.. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులతో వైన్స్, బార్ రెస్టారంట్ యజమానుల డబ్బుల కిక్కు దిగింది.. నిబంధనలు అతిక్రమించి తెల్లారే వరకు మద్యం విక్రయిస్తారా.. మీ భరత పడతాం అని ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు వైన్స్, బార్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరినుంచి లక్ష విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
సోమవారం (జూన్ 24) తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, బోరబండ, చిక్కడపల్లి పోలీస్ట్ స్టేషన్ల పరిధిలోని పలు వైన్సులు, బార్లపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. అక్రమంగా మందు అమ్ముతున్న దుకాణాలు, బార్ లపై దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేరశారు. అక్రమంగా అమ్ముతున్న 48 లీటర్ల మందును సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ది బ్లూ హెవెన్ రెస్టారెంట్ అండ్ బార్ అక్రమంగా మద్యం అమ్ముతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి అర్థరాత్రి దాటాక కూడా మద్యం అమ్ముతూ బాగా సంపాదిస్తోంది. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులుదాడులు చేసి అక్రమంగా మద్యం అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేశారు.