layoffs: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేఆఫ్స్.. 25 శాతం ఉద్యోగులు ఇక ఇళ్లకే..!!

layoffs: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేఆఫ్స్.. 25 శాతం ఉద్యోగులు ఇక ఇళ్లకే..!!

Dr Reddy’s layoffs: రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఐటీ సేవల రంగంతో పాటు కేవలం కొన్ని కంపెనీల్లో కనిపించిన ఈ లేఆఫ్స్ ప్రస్తుతం ఫార్మా రంగాన్ని కూడా వెంటాడుతున్నాయి. 

హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ తన ఉద్యోగుల సంఖ్యలో 25 శాతాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. దీని ద్వారా ఉద్యోగుల వేతన ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ సీనియర్ లెవెల్ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినట్లు వెల్లడైంది. పైగా ఇందులో ఏటా కోటికిపైగా వేతనం అందుకుంటున్న ఉద్యోగులు కూడా ఉన్నట్లు వెల్లడైంది. 

ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 50-55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వ్యక్తులకు ఫార్మా దిగ్గజం ప్రస్తుతం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఆఫర్ చేస్తోంది. ఎక్కువ వేతనం కలిగిన ఉద్యోగులను వివిధ డిపార్ట్మెంట్లలో తొలగింపులకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.92వేల కోట్లుగా ఉంది. ఈనెల ప్రారంభంలో కంపెనీ ఆదాయపు పన్ను కమిషనల్, హైదరాబాద్ నుంచి రూ.2వేల 395 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులను అందుకున్నట్లు వెల్లడైంది. 2022లో కంపెనీ చేపట్టిన విలీన ప్రక్రియకి సంబంధించి ఎందుకు పన్ను వేయకూడదో చెప్పాలంటూ అధికారులు ఫార్మా కంపెనీకి నోటీసులు పంపారని వెల్లడైంది.