హైదరాబాద్​ లో భారీ చోరీ.. 34 తులాల బంగారం.. రూ. 4.5 లక్షలు... విదేశీనగదు అపహరణ

హైదరాబాద్​ లో భారీ చోరీ.. 34 తులాల బంగారం.. రూ. 4.5 లక్షలు... విదేశీనగదు అపహరణ

హైదరాబాద్​ లో దొంగలు రెచ్చిపోయారు. ఫిలింనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని షేక్​ పేటలో ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు.  డైమండ్​ హిల్స్​ లో తాళం వేసిన ఇంటిని దోచుకున్న దుండగులు.. 34 తులాల బంగారం.. రూ. 4.5 లక్షలు.. 550 కెనెడియన్​ డాలర్లు తస్కరించారు.  బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.  

చోరీ జరిగిన ఇంటిని మొజాహిత్ అనే వ్యక్తికి సంబంధించినదిగా పోలీసులు తెలిపారు.. ఇదేఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు . చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు మొజాహిత్​ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. రంజాన్ మాసం కావడంతో  బంధువుల ఇంటికి వెళ్లాడు.  ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు.  చోరీకి పాల్పడడమే కాకుండా.. సీసీ కెమెరాల్లో తమ వీడియోస్ కనిపించకుండా సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తో సహా ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. మోజాహిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.