అల్వాల్ ఇద్దరమ్మాయిల మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ECIL ఓయో రూంలో గుర్తించిన పోలీసులు

అల్వాల్ ఇద్దరమ్మాయిల మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ECIL ఓయో రూంలో గుర్తించిన పోలీసులు

సికింద్రాబాద్: అల్వాల్లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన యువకులు బాలికలను ట్రాప్ చేశారు. ఇద్దరు బాలికలను ఓయో రూంకు తీసుకెళ్ళి ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

యువకులను దమ్మాయిగూడకు చెందిన ఆకుల సాత్విక్, ఈసీఐఎల్కి (ECIL) చెందిన కర్నాటి మోహన్ చంద్గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులకు మచ్చ బొల్లారంకి చెందిన ఇద్దరు బాలికలు పరిచయం అయినట్లు విచారణలో తేలింది. 5 నెలలుగా బాలికలతో ఈ ఇద్దరు యువకులు చాట్ చేశారు.

మార్చి19న ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ECILలోని ఓయో రూంలో ఉన్నట్లు గుర్తించి బాలికలను పోలీసులు రెస్క్యూ చేశారు. యువకులపై కేసు నమోదు చేశారు. ఓయో లాడ్జి నిర్వాహకుడి పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.