న్యూఢిల్లీ, వెలుగు: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇకపై చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదని హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవి లత హెచ్చరించారు. బీజేపీ రిలీజ్ చేసిన లోక్‌సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో హైదరాబాద్ అభ్యర్థిగా మాధవి లత పేరును ప్రకటించడంపై ఆమె పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసుకు వెళ్లి.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్‌ను కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ ఆమెకు పార్టీ కండువా కప్పి, అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను సంఘ్ పరివార్ నుంచి వచ్చానని, పార్టీలో లేనన్న కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోనన్నారు. సొంత ఇంట్లో వాళ్లు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరం కాదని పేర్కొన్నారు. సంఘ్ పరివార్ కార్యకర్తగా చేసిన సేవే తనకు టికెట్ వచ్చేలా చేసిందని ఆమె తెలిపారు. ధర్మం, న్యాయం తెలిసిన తాను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. చాలా ఏండ్లుగా హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అసదుద్దీన్ ఒవైసీ.. మైనారిటీలకు, హిందువులకు న్యాయం చేయట్లేదని మండిపడ్డారు. ఈసారి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మార్పు కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు.
అసదుద్దీన్ ఒవైసీకి హైదరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మాధవి లత వార్నింగ్
- హైదరాబాద్
- March 4, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- IND vs ENG: అభిషేక్ మెంటల్ నా.. ధనాధన్ ఇన్నింగ్స్‌పై నితీష్ కామెంట్స్ వైరల్
- లోక్ సభలో గందరగోళం.. కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు విపక్షాల పట్టు
- తొడ కొట్టి చక్రం తిప్పిన బాలయ్య: హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కైవసం
- Prabhas: ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. కన్నప్పలో డార్లింగ్ క్యారెక్టర్ ఏంటంటే?
- నందిపేట మండలంలో రెండున్నర కిలోల గంజాయి పట్టివేత
- వరంగల్‌లో వివాహా వేడుకకు హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- Womens U19 T20 World Cup: ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ భారీ నజరానా
- ఇది కదా కావాల్సింది.. బంగారం రేటు తగ్గిందండోయ్.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే..
- SandeepReddyVanga: అర్జున్ రెడ్డికి సాయిపల్లవిని అనుకున్నా.. స్లీవ్లెస్సే వేసుకోదన్నారు
Most Read News
- కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
- అది బేసిక్ నీడ్.. కమిట్మెంట్ అడగడంలో తప్పేముంది: అనసూయ
- IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్
- మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
- Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
- కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- పన్నుల విధానంలో TDS,TCS అంటే..వీటి మధ్య తేడా ఏంటీ..?
- తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..