కోయంబత్తూరు: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్)లో భాగంగా జరిగిన ఫార్ములా–4 ఇండియన్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ అఖిల్ అలీభాయ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రౌండ్‌లోని చివరి రెండు రేసుల్లో అలీభాయ్ 27ని.14.880 సెకన్లతో రెండో ప్లేస్, 27ని.16.425 సెకన్లతో మూడో ప్లేస్‌ను సాధించాడు. ఇక రెండు రేసుల్లోనూ రుహాన్ అల్వా (26ని.55.114 సెకన్లు), (27ని.00.884 సెకన్లు) టాప్ ప్లేస్‌ను సాధించాడు. అయినప్పటికీ సీజన్ చాంపి యన్‌షిప్‌లో రుహాన్ కంటే అలీభాయ్ 29 పాయింట్లు ఆధిక్యంలో నిలిచాడు.
ఇక ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్)లో గోవా ఏసెస్ జేఏ రేసింగ్ జట్టు చాంపియ న్‌గా నిలిచింది. చివరి రేసులో రౌల్ హైమాన్ (26:39.020 సెకన్లు), గాబ్రియోలా జిల్కోవా (27:07.684 సెకన్లు) ఒకటి, రెండు స్థానాలను సాధించడంతో చాంపియన్‌షిప్ సొంతమైంది. ఇండియాకు చెందిన మహ్మద్ ర్యాన్ (చెన్నై టర్బో రైడర్, 27:29.813 సెకన్లు) మూడో ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు.