
చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్‌ను హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ టీమ్ ఓటమితో ఆరంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 14–16, 11–15, 7–15తో వరుస సెట్లలో చెన్నై బ్లిట్జ్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి చెన్నై మిడిల్ బ్లాకర్స్ తమ టీమ్‌ను ముందుండి నడిపించారు. అఖిన్, లియాండ్రో జోస్ బ్లాక్‌హాక్స్ పాయింట్లను బ్లాక్ చేశారు. మరోవైపు పవర్‌ఫుల్ స్మాష్‌లతో చెలరేగిన చెన్నై ప్లేయర్ సమీర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.