గ్రేటర్ సిటీని శుక్రవారం ఉదయం పొగ మంచు కమ్మేసింది. 9.30 గంటల దాకా పట్టి వదల్లేదు. కోర్సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. హెడ్లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. స్టూడెంట్లు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
ALSO READ | నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోలు, పెద్దఅంబర్ పేట, అబ్దుల్లాపూర్ మెట్, ఘట్కేసర్, మేడ్చల్, ఆర్సీపురం, రాజేంద్రనగర్, శంషాబాద్ప్రాంతాలను మంచు దుప్పటిలా కప్పేసింది. నేషనల్ హైవేలపై వెహికల్స్ రాకపోకలు నెమ్మదిగా సాగాయి.
– వెలుగు, ఎల్బీనగర్