హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ

హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన జావెద్ గ్యాంగ్ పై నమోదైన కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. గతంలో పేలుళ్లకు కుట్ర పన్నిన నిందితులను జావెద్, మాజ్, సమియుద్దీన్ గా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జావెద్ గ్యాంగ్ పాకిస్థాన్, నేపాల్ మీదుగా భారత్ లోకి పేలుడు పదార్థాలు తరలించింది. వాటితో హైదరాబాద్ లో దసరా సమయం లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.