బుక్ ఫెయిర్ కు ఊహించని స్పందన : యాకూబ్ 

 బుక్ ఫెయిర్ కు ఊహించని స్పందన : యాకూబ్ 
  •  హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ 

బషీర్ బాగ్,  వెలుగు :  హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రియులను విశేషంగా ఆకట్టుకుని, సక్సెస్ అయిందని  సొసైటీ అధ్యక్షుడు డా.యాకూబ్ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇందిరాపార్కు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో దాశరథి కృష్ణమాచార్య ప్రాంగణంలో గత డిసెంబర్19 నుంచి 29 వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించినట్టు చెప్పారు.  

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా.. గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు, కవులు, రచయితలు, కళాకారులు, బుక్ ఫెయిర్ సలహాదారులతో పాటు పుస్తక ప్రియులు భారీగా తరలివచ్చారని వివరించారు.11 రోజులు కొనసాగిన పుస్తకాల పండగకు 13 లక్షల మంది దాకా హాజరయ్యారని పేర్కొన్నారు. 350 స్టాళ్లలో 210 నిర్వాహకులు పలు రకాల పుస్తకాలను ప్రదర్శించారని తెలిపారు.

ఢిల్లీ, కొల్ కతా, చెన్నై, పూనె సిటీల్లోని బుక్ ఫెయిర్ల లాగానే హైదరాబాద్ బుక్ ఫెయిర్ విస్తృత ప్రజాదరణ పొందిందని వివరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఆర్.శ్రీనివాస్(వాసు), ఉపాధ్యక్షుడు కె.బాల్ రెడ్డి, బి.శోభన్ బాబు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, సభ్యులు స్వరాజ్ కుమార్, కృష్ణారెడ్డి, టి.సాంబశివరావు పాల్గొన్నారు.