ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు వేల పుస్తకాలతో 350 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన కవుల ఫొటోలతో భారీ ఫ్లెక్సీని ప్రదర్శనకు ఉంచారు.
టెక్నాలజీతో పాటు చిన్నారుల ఈజీ లెర్నింగ్‌కు సంబంధించిన పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘వీ6 వెలుగు’ స్టాల్ అందుబాటులో ఉంది. తెలంగాణ రుచుల ఫుడ్ స్టాల్స్ నోరూరిస్తున్నాయి. ఈ నెల 29 వరకు బుక్ ఫెయిర్ కొనసాగనుంది. – వెలుగు, ముషీరాబాద్