డిసెంబర్​ 19 నుంచి హైదరాబాద్​ బుక్​ ఫెయిర్

డిసెంబర్​ 19 నుంచి హైదరాబాద్​ బుక్​ ఫెయిర్
  • ఎన్టీఆర్​ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
  • ప్రారంభించనున్న మంత్రులు  జూపల్లి, పొన్నం 
  • 350  స్టాల్స్​ ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు : ఎప్పుడెప్పుడా అని పుస్తక ప్రియులంతా ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్​ బుక్​ఫెయిర్​’ గురువారం నుంచి షురూ కానుంది.   ఎన్టీఆర్​స్టేడియంలో నిర్వహించే కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు , పొన్నం ప్రభాకర్ హాజరై  ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ​ఫెయిర్ ​కొనసాగుతుంది. 

పదిరోజుల పాటు జరిగే  ఈ పండుగలో 350 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ తెలుగు భాషతో పాటు ఇతర భాషలు, ఇంటర్నేషనల్​పబ్లికేషన్లకు సంబంధించిన పుస్తకాలు కూడా దొరుకుతాయి. పది రోజుల పాటు జరిగే ఈ బుక్​ఫెయిర్​ను లక్షల మంది విజిట్​ చేసే అవకాశం ఉంది.    

మూడు దశాబ్దాలుగా.. 

హైదరాబాద్​ బుక్​ఫెయిర్​నగరంలో మూడు దశాబ్దాల క్రితం మొదలైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ముంబై, చెన్నై, పుణె, ఢిల్లీ, కోల్​కతా, అహ్మదాబాద్​, కేరళ నుంచి పబ్లిషర్లు   స్టాళ్లను ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 37వ హైదరాబాద్​బుక్​ ఫెయిర్​లో 350 స్టాళ్లు ఉంటే  175 తెలుగు పుస్తకాల స్టాల్స్​,  135 ఇంగ్లిష్​, భారతీయ భాషల స్టాల్స్​ ఉన్నాయి. వీటితో పాటు ఇండిపెండెంట్​ రైటర్ల పుస్తకాల కోసం ప్రత్యేక స్టాల్స్​ఏర్పాటు చేశారు.  

ALSO READ : ప్రతి హాస్టల్​లో సౌకర్యాలు కల్పించాలి

ప్రముఖులకు నివాళితో.. 

బుక్​ఫెయిర్​ ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య పేరు ఖరారు చేశారు. సాంస్కృతిక, సభల వేదికకు  బోయి విజయభారతి పేరు, మరో వేదికకు సాదిక్‌  పేరు పెట్టారు. ఈ వేదికలపై రోజూ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు,  పుస్తకావిష్కరణలు, చర్చా కార్యక్రమాలు ఉంటాయి. 

పది లక్షల మంది విజిట్​ చేస్తారు


పది రోజుల ఈ బుక్​ ఫెయిర్​ను సుమారు 10లక్షల మంది విజిట్​చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, యువకులు, పుస్తక ప్రియులు బుక్ ఫెయిర్​ను ఉపయోగించు కోవాలి. అన్ని స్టాల్స్​లో పుస్తకాలకు డిస్కౌంట్​ఉంటుంది.  అనువాదాలు, నవలలు, కవిత్వం, కథల పుస్తకాలకు ఈ బుక్​ ఫెయిర్​వేదికగా నిలుస్తుంది.


  – ఆర్​ వాసు, సెక్రటరీ, హైదరాబాద్​ బుక్​ ఫెయిర్–

ఈ ఏడాది కొత్త  ఏర్పాట్లుపది రోజుల పుస్తకాల పండగను ప్రజలంతా సక్సెస్​ చేయాలి.  రెండు నెలల నుంచి బుక్​ఫెయిర్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. విజిటర్స్​కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాం.  రెండు వేదికలతో పాటు విజిటర్స్​ విశ్రాంతి కోసం ప్రాంగణంలో బెంచీలను పెడుతున్నాం. కిందటి ఏడాది కంటే ఈ ఏడాది కొత్త ఏర్పాట్లతో బుక్​ఫెయిర్​ కొనసాగుతోంది. 


– కిష్టారెడ్డి, బుక్​ ఫెయిర్​ కో ఆర్డినేటర్​–