- 320కి పైగా స్టాళ్లు ఏర్పాటు
- ప్రధాన ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య పేరు
- వేదికలకు బోయి విజయభారతి, తోపుడు బండి సాధిక్ పేర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 19 నుంచి 29 వరకు ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ నిర్వహిస్తున్నట్లు బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ షేక్ తెలిపారు. ఎప్పటిలాగే ఇందిరాపార్కు వద్ద ఎన్టీఆర్‌స్టేడియంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బుక్‌ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం బషీర్బాగ్ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు యాకూబ్, కార్యదర్శి ఆర్.వాసు వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బుక్‌ఫెయిర్ నిర్వహిస్తున్నామన్నారు. 320కు పై స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటున్నారని, రచనలు, ప్రచురణలను పాఠకులకు పరిచయం చేసుకునేందుకు రచయితలకు ప్రత్యేకంగా రైటర్ స్టాల్స్ కేటాయించామని వెల్లడించారు.
ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సాహిత్య రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులను యాది చేసుకుంటూ బుక్ఫెయిర్ప్రాంగణానికి, వేదికలకు పేర్లు పెట్టినట్లు తెలిపారు. ప్రధాన ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య, సభా కార్యక్రమాల వేదికకు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడు బండి సాధిక్ పేర్లను ఖరారు చేశామన్నారు.
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ఉంటుందని సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్తెలిపారు. నోరూరించే ఫుడ్ స్టాల్స్ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ వంటకాలు, పిండి వంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.