పెండింగ్లో ఉన్న రెండు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటిించింది బీఆర్ఎస్.. హైదరాబాద్ లోని గోషామహల్, నాంపల్లి అభ్యర్థులను ప్రకటించింది. గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ పోటీ చేయనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. మంత్రి కేటీఆర్ వీరిద్దరికి బీఫామ్స్ ఇచ్చారు.
ఆగస్టులో 115 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును ప్రకటించిన బీఆర్ఎస్ జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ ను పెండింగ్ లో పెట్టింది. ఇటీవల జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని.. నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించింది. లేటెస్ట్ గా నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం 119 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా నాలుగు స్థానాలను పెండింగులో పెట్టింది. బీజేపీ ఇంకా 19 స్థానాలను పెండింగులో పెట్టింది.
నాంపల్లిలో బీజేపీ నుంచి రాజాసింగ్ బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి మొగలి సునీత పోటీ చేస్తున్నారు. నందకుమార్ గత ఎన్నికల్లోనూ నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గోషామహల్ నుంచి నవంబర్ 4న బుల్లెట్ పై వెళ్లి రాజాసింగ్ నామినేషన్ వేశారు.