అర్ధరాత్రి ఒంటిగంట వరకు వాదనలు

జూబ్లీహిల్స్, వెలుగు: కొండాపూర్​లో ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డిని అరెస్ట్​ చేసిన పోలీసులు రాత్రి వరకు ఆయనను బంజారాహిల్స్​ పీఎస్​లో ఉంచి విచారణ జరిపారు. రాత్రి పదిన్నర గంటలకు ఉస్మానియా దవాఖానకు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొత్తపేటలోని నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్​ ఎదుట హాజరుపరిచారు. అక్కడ అర్ధరాత్రి ఒంటి గంట వరకు వాదనలు జరిగాయి.