అధిక లాభాల ఆశ చూపి తెలుగు హీరోయిన్లని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్...

అధిక లాభాల ఆశ చూపి తెలుగు హీరోయిన్లని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్...

ఈమధ్య కాలంలో కొందరు కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ కటకటాల పాలవుతున్నారు. అయితే అధిక లాభాల ఆశచూపి సినీ సెలబ్రేటీలు, పలువురు ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆర్ధిక మోసానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. 

పూర్తివివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని హైదరాబాద్ లో కాంతిదత్‌ అన్వే బిజినెస్ మెన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే కాంతిదత్  తృతీయ జ్యూవెలరీతోపాటూ సస్టెయిన్ కార్ట్ సంస్థని స్థాపించాడు. ఈ సంస్థల్ని అడ్డుపెట్టుకుని సిటీలోని ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన కంపెనీలలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు చెల్లిస్తానని నమ్మబలికి దాదాపుగా రూ.100 కోట్లు కలెక్ట్ చేశాడు. కానీ లాభాలు చెల్లించడంలో కాంతిదత్ విఫలమయ్యాడు.

ALSO READ | స్టార్ డైరెక్టర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విజయవాడ అమ్మాయి..

దీంతో శిల్పా రెడ్డి అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి కాంతి దత్ ని అరెస్ట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, పరిణితి చోప్రా తదితరలతోపాటూ మరింత కాంతిదత్ సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అయితే కాంతదత్ పై సెంట్రల్ క్రైం స్టేషన్ లో కూడా పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పలు కోణాల్లో ఈ కేసుని విచారిస్తున్నారు పోలీసులు.