ఢిల్లీ లిక్కర్ స్కాం..ఈడీ కేసులో పిళ్లైకి బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం..ఈడీ కేసులో పిళ్లైకి బెయిల్
  • సీబీఐ కేసులో కోర్టు ముందుకు ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తోన్న హైదరాబాద్ బిజినెస్ మాన్ అరుణ్ రామచంద్ర పిళ్లైకి బెయిల్ మంజూరైంది. మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ పిళ్లై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. బుధవారం విచారణ జరిపిన జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు చేశారు. పిళ్లైని 2023 మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది.

పలుమార్లు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే, పిళ్లై, అప్రూవర్లుగా మారిన ఇతర సహ నిందితులు కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. వాటి ఆధారంగా కవితను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా పిళ్లైని కవితకు బినామీగా ఈడీ అధికారులు ఆరోపించారు.

అయితే, అనూహ్యంగా పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో సీబీఐ వేసిన చార్జ్ షీట్లపై బుధవారం సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా విచారణ చేపట్టారు. కవితతో పాటు, కేసులోని 40 మంది సహ నిందితులు వర్చువల్ మోడ్​లో హాజరయ్యారు.