
రోడ్డుపై ముందు వెహికల్స్.. కారులో వెనక ప్యాసింజర్.. డ్రైవింగ్ సీటులో కూర్చొన్న క్యాబ్ డ్రైవర్ ఇవేవి పట్టించుకోకుండా ఎంచక్కా పబ్జీ గేమ్ ఆడుతూ చిల్ అయ్యాడు. ఓ చేయి స్టీరింగ్‌పై.. మరో చేతితో పబ్జీ ఆడుతూ క్యాబ్ డ్రైవ్ చేశాడు. వెనక కూర్చొన్న ప్యాసింజర్ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడొద్దని హెచ్చరించినా.. చెప్పేది నాకు కాదులే అన్నట్లుగా ఆ క్యాబ్ డ్రైవర్ అలాగే గేమ్ ఆడుతూనే క్యాబ్ డ్రైవ్ చేశాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ క్యాబ్ డ్రైవ్ చేస్తూనే పబ్జీ ఆడిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి క్యాబ్ డ్రైవ్ చేస్తూ పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. కారులో వెనక కూర్చొన్న మరో వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియో తీస్తున్న ప్రయాణీకుడు.. ఉబర్‌కు ఫిర్యాదు చేస్తానని డ్రైవర్‌ను హెచ్చరించిన అతడు పట్టించుకోకుండా అలాగే గేమ్ ఆడాడని తెలిపాడు. దీనివల్ల తన ప్రాణానికే కాకుండా.. ప్రయాణీకులకు మరియు రోడ్లపై ఉన్న ప్రజలకు కూడా ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు క్యాబ్ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :- 4,961 సైబర్ నేరాల్లో రూ.43.31 కోట్లు రీఫండ్
ప్రయాణికుల భద్రతా గురించి ఆలోచించకుండాగేమ్ ఆడుతూ ప్రమాదకరంగా కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ డ్రైవర్‌కు చికెన్ డిన్నర్ జైలులో ఉంటుందని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘ఖచ్చితంగా ఇది ఫన్నీ కాదు. ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో ఉంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని” కోరాడు. “నేనైతే ఆ క్యాబ్ డ్రైవర్‌కు గేమ్ ఆడకని స్పష్టంగా చెప్పేవాడిని. అయినప్పటికీ ఆపకపోతే ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసేవాడిని’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ ఘటనపై అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇంకా స్పందించలేదు.