Cyber crime: రోజుకు 600 మంది టార్గెట్..హైదరాబాద్లో నకిలీ కాల్సెంటర్ మోసాలు..గుట్టురట్టు

Cyber crime: రోజుకు 600 మంది టార్గెట్..హైదరాబాద్లో నకిలీ కాల్సెంటర్ మోసాలు..గుట్టురట్టు

హైదరాబాద్లో మరో నకిలీ కాల్సెంటర్ గుట్టు రట్టయింది. కాల్ సెంటర్ పేరుతో మాదాపూర్ కేంద్రంగా అమెరికన్లను మోసం చేస్తున్న నార్త్ ఇండియాకు చెందిన ముఠా సైబర్ మోసాలకు చెక్ పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. అనధికారిక లావాదేవీల గురించి తప్పుడు సమాచారం ఇస్తూ.. వారికి ఖాతాలనుంచి నిధులు కాజేస్తున్న మోసగాళ్ల ఆట కట్టించారు. వివరాల్లోకి వెళితే..  

హైదరాబాద్లో అమెరికా పౌరులను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టయింది. మాదాపూర్లో ఓ భవనంలో  ఎగ్జిటో సొల్యూషన్స్‌ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ కాల్ సెంటర్పై దాడి చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు..52 ల్యాప్ టాప్ లు, 63 మొబైల్ ఫోన్లు, 27 ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ కుంభకోణానికి ప్రధాని నిందితురాలిగా భావిస్తున్న చందామనస్విని(36)..ఎగ్జిటో సొల్యూషన్స్‌ పేరుతో మోసపూరిత కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు తేలింది. మాదాపూర్ లోని ఓ భవనంలో ఒక అంతస్తును అద్దెకు తీసుకుంది.గుజరాత్ కు చెందిన కైవన్ పటేల్, రూపేష్ కుమార్ అలియాస్ జడ్డూలు ఈ నకిలీ కాల్ సెంటర్ ను నడుపుతున్నారు. వీరికి దుబాయ్ నుంచి విక్కీ మరో నిందితుడు, అజాద్ అనే మరో వ్యక్తి సహకరించారు. 

ALSO READ | పెళ్లి చేసుకుని ఎంచక్కా హనీమూన్కు వెళ్లారు.. ఆ విషయం తెలిసి విడాకులిచ్చేసింది..!

ఇందులో పనిచేస్తే  టెలి-కాలర్లు ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. బాధితులను మార్చడంలో శిక్షణ టెలి-కాలర్లు ఇస్తారు. పేపాల్ ప్రతినిధులను అనుకరించి అమెరికా పౌరులకు అనధికార లావాదేవీల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం, సున్నితమైన డేటాను దొంగిలించడం వీరిపని. తాము మోసాలకు పాల్పడుతున్నట్లు ఎంప్లాయీస్ అందరికీ ముందే  తెలుసు. 

ఆన్ లైన్ ద్వారా దొంగిలించిన నిధులను క్రిప్టోకరెన్సీగా మార్చి డిజిటల్ వ్యాలెట్లకు బదిలి చేస్తారు. ప్రతి ఉద్యో్గి రోజుకు కనీసం 10మందిని మోసం చేయాలని  టార్గెట్ ఉంటుంది. హైదరాబాద్ కాల్ సెంటర్ రోజుకు 600 మందిని మోసం చేసి, క్రిప్టో ద్వారా నిధులను బదిలీ చేయడం టార్గెట్ గా పనిచేస్తారు. మోసానికి దోహదపడేందుకు పేపాల్ కస్టమర్ల డేటాను ప్రధాని నిందితురాలు చందా మనస్వినికి అందజేస్తారని అధికారులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు , చందా మనస్విని, రూపేష్ కుమార్‌ను పట్టుకునే పనిలో పడ్డారు.