ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​రీ మోడలింగ్ పనుల నేపథ్యంలో గురువారం రెండు ఎంఎంటీఎస్​రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్​దా నగర్– సికింద్రాబాద్(47246)

 సికింద్రాబాద్– ఉమ్​దా నగర్(47247)​ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.