
హైదరాబాద్సిటీ నెట్వర్క్, వెలుగు: స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం సిటీలో ఘనంగా నిర్వహించారు. తార్నాక డివిజన్ శాంతి నగర్, ఇసుక బావిలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డి నివాళులర్పించారు. వికారాబాద్ బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్రామ్విగ్రహానికి అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బషీర్ బాగ్ చౌరస్తాలోని విగ్రహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గణేశ్, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, వివిధ సంఘాల నేతుల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బాబు జగ్జీవన్ రామ్ ఫొటోకు కమిషనర్ ఇలంబరితి నివాళి అర్పించారు.