ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీకి స్థల పరిశీలన

ములుగు, వెలుగు : ములుగులో సెంట్రల్‌‌‌‌ ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైన స్థలం, తాత్కాలిక క్లాస్‌‌‌‌ల నిర్వహణకు కావాల్సిన బిల్డింగ్‌‌‌‌లను శనివారం హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీ ఆఫీసర్లు పరిశీలించారు. హైదరాబాద్‌‌‌‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌ దేవేశ్‌‌‌‌ నిగమ్, వైస్‌‌‌‌ ఛాన్స్‌‌‌‌లర్‌‌‌‌ బీజే.రావు, డిప్యూటీ రిజిస్ట్రార్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ కుమార్‌‌‌‌తో పాటు ఐటీడీఏ పీవో అంకిత్‌‌‌‌

అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ వేణుగోపాల్‌‌‌‌ ములుగు గట్టమ్మ వద్ద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 350 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీ టెంపరరీ క్లాస్‌‌‌‌ల కోసం ఐటీడీఏ పరిధిలోని జాకారం వైటీసీని కూడా సందర్శించారు. అంతకుముందు కలెక్టర్‌‌‌‌ ఇలా త్రిపాఠిని కలిశారు. సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌రెడ్డి, ఏటీడీవో దేశీరాం, తహసీల్దార్‌‌‌‌ విజయ్‌‌‌‌భాస్కర్‌‌‌‌, సర్వేయర్‌‌‌‌ పాల్గొన్నారు.