హైదరాబాద్ చందానగర్ లో సినిమా షూటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన అల్యూమినియం ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆలిండ్ ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్ల వెనక ఉన్న డంపింగ్ యార్డ్ లో మంటలు చెలరేగాయి.
సినిమా షూటింగ్ కు వాడిన వస్తువులన్నీ డంపింగయ్ యార్డులో పడేశారు. ఈ మంటలతో చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.