డిమాండున్నా.. ఏసీ బస్సులేస్తలేరు

డిమాండున్నా.. ఏసీ బస్సులేస్తలేరు
  • నజర్‍ పెట్టని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు
  • నష్టం వస్తున్నాఎయిర్ పోర్టు వైపే ఏసీ బస్సులు
  • వేసవిలో లాభదాయకంకానున్న పలు రూట్లు
  • డిమాండ్‍ మేరకు బస్సులు తిప్పాలని వినతులు

హైదరబాద్, వెలుగు:ఎండాకాలం వచ్చిందంటే జనం సొంత వాహనాలను చాలా వరకు తగ్గిస్తారు. వీలైనంత వరకు ప్రజారవాణాను వినియోగిం చేందుకు ఆసక్తిచూపుతారు. ఎండల్లో వాహనంపై వెళ్లటం కన్నా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఇతర వాహనాలపై  మొగ్గుచూపుతారు. మరీ ముఖ్యంగా ఏసీబస్సుల్లో వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కానీ, ఇందుకు తగిన విధంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ అధికారులు ఏసీ బస్సులను ఏర్పాటు చేయటం లేదు. నగరంలోని ప్రధాన రూట్లలో చాలా వరకు ఏసీ బస్సులకు డిమాండ్ఉన్నప్పటికీ కొన్ని రూట్లలో మాత్రమే వీటినినడిపిస్తున్నారు. నిత్యం గ్రేటర్ హైదరాబాద్జోన్ పరిధిలో ఆర్టీసీ అధికారులు ప్రయాణికులఅవసరాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైసర్వే నిర్వహిస్తారు. అందుకు అనుగుణంగాబస్సులను అందుబాటులోకి తెస్తారు. కానీ ఏసీబస్సుల విషయంలో మాత్రం చాలా రూట్లలోడిమాండ్ ఉందని తెలిసినప్పటికీ గ్రేటర్ జోన్అధికారులు మాత్రం బస్సులను పెం చటం లేదు.దీంతో జనం ఇతర ప్రత్యామ్ నాయ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.

3600 బస్సుల్లో ఏసీ బస్సులు 108

గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఆర్టీసీ ఏసీ బస్సులసంఖ్య విం టే ఆశ్చర్యం కలగక మానదు.రోజుకు దాదాపు 35 లక్షల మంది ఇప్పటికీఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. గ్రేటర్జోన్ పరిధిలో 3600 వరకు బస్సులున్నాయి.దాదాపు 40 వేలకు పైగా ట్రిప్పుల ద్వారారోజుకు 35 లక్షల మంది ఆర్టీసీ బస్సులద్వారానే ప్రయాణం చేస్తున్నారు. అలాం టి ఆర్టీసీ-కి గ్రేటర్ పరిధిలోని మొత్తం ఏసీ బస్సుల సంఖ్య108 మాత్రమే. వాటిలోనూ నెల క్రితమే 40 ఏసీబస్సులు అందుబాటులోకి వచ్చాయి. అంటే అం-తకుముం దు వరకు ఉన్న బస్సులు 68 మాత్రమే.ఈ బస్సులను కూడా 222, 217, 219 వంటికొన్ని రూట్లలో నే అందుబాటులో ఉంచారు.మిగతా రూట్లలో నూ ఎండకాలం వచ్చిందం-టే చాలు ఏసీ బస్సుల కోసం ఫుల్ డిమాండ్ఉంటోంది. కానీ, దాదాపు దశాబ్దంపాటు ఈదిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో జనంమండే ఎండల్లో చెమటలు కక్కుతూ ప్రయాణా-లు చేయాల్సి వస్తోంది.

చాలా ఏరియాల్లో ఏసీ బస్సుల కోసం డిమాండ్

ప్రస్తుతం ఏసీ బస్సులు కావాలని చాలా ప్రాంతా-ల్లో జనం డిమాండ్ చేస్తున్నారు. అయితే మెట్రోప్రారంభం అయ్యా క 222 రూట్లో కొన్ని ఏసీబస్సులను తగ్గించి ఇతర మార్గా లకు మళ్లిం చా-రు. ఇప్పుడు 222, 217, 219, 300/126 లాంటి రూట్లలోనే కొన్ని ఏసీ బస్సులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే రూట్ తో పాటు కోఠి నుంచి హైటెక్ సిటీవెళ్లే రూట్లలో ఏసీ బస్సులకు డిమాండ్‍ ఉంది. మెహదీపట్నం నుంచి మియాపూర్, సికిం ద్రాబాద్ నుంచి పటాన్ చెరువు, సికిం ద్రాబాద్ నుంచి మేడ్చల్ ఇలా చాలా రూట్లలో ఏసీబస్సుల అవసరం ఉంది. ముఖ్యంగా సిటీనలువైపులా నుంచి హైటెక్ సిటీ వైపు వచ్చే రూట్లలో ఏసీ బస్సులను పెం చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

డిమాండ్ లేకున్నా ఎయిర్ పోర్ట్ కే ఏసీ బస్సులు

నగరంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు జనం ఏసీ బస్సులు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ, ఆర్టీసీ అధికారులు మాత్రం  ఉన్న బస్సుల్లో సగానికిపైగా ఎయిర్ పోర్ట్ కే నడిపిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన 40 ఎలక్ర్టిక్ ఏసీ బస్సులను కూడా ఎయిర్ పోర్ట్ కే నడిపిస్తు న్నారు. అయితే, ఎయిర్ పోర్ట్ కు బస్సుల విషయంలో పెద్దగా డిమాండే లేదు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే చాలా మంది ప్రయాణికులకు సొంతంగా వాహనాలు ఉంటాయి. లేదంటే వారు ఎక్కువగా క్యాబ్ లను ఆశ్రయిస్తుం టారు. బస్సుల్లో ఎయిర్ పోర్ట్ వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువ. ప్రస్తు తం ఎయిర్ పోర్ట్ కు దాదాపు 68 బస్సులకు పైగా ఏసీ బస్సులను నడిపిస్తు న్నారు. కానీ ఈ బస్సుల్లో జనాలు ఉండటం లేదు. ఖాళీగా వెళ్తున్నాయి. ఇటీవల ఆర్టీసీ అధికారులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి న ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా జనమే కనిపించటం లేదు. అసలే రోజుకు కోటి రూపాయలకు పైగా నష్టాల్లో ఉంది గ్రేటర్ హైదరాబాద్ జోన్. అయినా, అంతగా లాభదాయకం కాని ఎయిర్ పోర్ట్ రూట్లో నే ఏసీ బస్సులు నడపటం ఆశ్చర్యం కలిగిస్తోం ది.