- హైదరాబాద్ సిటీలో 2021 రోడ్డు ప్రమాదాల రిపోర్ట్
- డ్రంకన్ డ్రైవ్‌లో 13 మంది మృతి
- 42.75 లక్షల ట్రాఫిక్ వయొలేషన్ కేసులు
- 2022లో రోడ్ సేఫ్టీ విజన్ తో ముందుకెళ్తాం:హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిటీ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డ్రంకన్ డ్రైవ్ కారణంగా 13 మంది చనిపోయారని వెల్లడించారు. డ్రంకన్ డ్రైవ్స్ తగ్గించాలంటే కుటుంబసభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతోనే యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నట్టు చెప్పారు. సిటీలో ట్రాఫిక్ వయొలేషన్ కేసులు లక్షల్లో నమోదైతున్నాయన్నారు. జనాల్లో అవేర్నెస్ కోసం డ్రంకన్ డ్రైవ్, రోడ్ సేఫ్టీపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బుధవారం ఆయన ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, విజయ్‌కుమార్‌తో కలిసి ఈ ఏడాది జరిగిన రోడ్ యాక్సిడెంట్స్కు సంబంధించి రిపోర్టును వెల్లడించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నం. 2లో జరిగిన డ్రంకన్ డ్రైవ్ యాక్సిడెంట్
వివరాలను చెప్పారు. నిందితులు బజార్ రోహిత్ గౌడ్(29), వెదుల్ల సాయి సోమన్‌రెడ్డి(27)ను అరెస్ట్ చేశామని తెలిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్ రూట్‌లోని15 సీసీ ఫుటేజ్‌లను కలెక్ట్ చేశామని చెప్పారు. నిందితుల కారును గుర్తించామని, టెక్నికల్ ఎవిడెన్స్ కింద కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని వివరించారు. కేసులో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు. నిందితులను ట్రేస్ చేసిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ సతీశ్, హోంగార్డు టి.జితేందర్‌ను సీపీ అభినందించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటామని,2021లో రోడ్ సేఫ్టీ విజన్‌తో ముందుకెళ్తామని చెప్పారు.