
- 2,800 బస్సుల్లో గ్లోబల్ పొజిషన్సిస్టమ్
- 1,250 బస్టాపుల్లో డిస్ప్లే బోర్డులు
- ఏ నంబర్బస్సు ఎంత సేపట్లో వస్తదో తెలిసేలా ఏర్పాటు
- రెండు నెలల్లో అందుబాటులోకి తేనున్న బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ బస్సు ప్రయాణికులకు జీహెచ్ఎంసీ తీపికబురు చెప్పింది. బస్టాప్ లలో బస్సుల కోసం ఎదురుచూడకుండా, ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి మనకు కావాల్సిన బస్సు ఎక్కడుందో.. ఎన్ని నిమిషాల్లో బస్టాప్‌కు రాబోతోందో ఈజీగా తెలుసుకోవచ్చు. దీని కోసం బస్ ఇన్ఫర్ మేషన్ సిస్టం పేరుతో ఓ యాప్ రూపొందిస్తోంది జీహెచ్ఎంసీ. అంతేకాదు...ఒకవేళ మన దగ్గర ఫోన్లేకపోయినా టెన్షన్పడాల్సిన పనిలేదు. బస్టాప్‌లో నిల్చుని పైకి చూస్తే చాలు ఏ బస్సు ఎప్పుడు వస్తుందో క్లియర్‌గా డిస్ప్లేలో కనబడుతుంది. సిటీని స్మార్ట్‌గా మార్చే చర్యల్లో భాగంగా మరో రెండు మూడు నెలల్లోనే దీన్ని సాక్షాత్కారం చేయనున్నది బల్దియా.
1,250 బస్టాపుల్లో స్పెషల్ స్క్రీన్స్
స్మార్ట్ఫోన్ఆపరేటింగ్తెలియనివారు, ఫోన్వాడనివారు, అస్తమానం యాప్ఓపెన్చేసి ఏం చూస్తాములే అనుకునే వారు ఇబ్బందులు పడకుండా గ్రేటర్ లోని 1,250 బస్టాపుల్లో ప్రత్యేకంగా స్క్కీన్ లను ఏర్పాటు చేయనున్నది బల్దియా. అంతకుముందు గ్రేటర్ పరిధిలోని 2,800 బస్సుల్లో జీపీఎస్ సిస్టం అమర్చనున్నారు. తర్వాత బస్టాప్ లలో ఉండే స్క్రీన్లు, యాప్ కి కనెక్ట్ చేస్తారు.
ఈ స్ర్కీన్లపై బస్సు నంబర్‌తో పాటు ఏ ప్రాంతం నుంచి వస్తోంది...ఏ ఏరియాకు వెళ్తుంది. ప్రస్తుతం బస్సు ఎక్కడుంది? అన్నది డిస్ ప్లే అవుతుంది. దీంతో పాటు యాప్ లోనూ బస్సుల లైవ్ లోకేషన్ తెలుసుకోవచ్చు. దీని కోసం ఆర్టీసీతో కలిసి పని చేస్తోంది జీహెచ్ఎంసీ. నెలరోజుల్లో టెండర్లు పూర్తి చేసి, తర్వాత మరో నెలలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఏండ్ల నిరీక్షణకు ‘తెర’
సిటీలోని చాలా ప్రాంతాల్లోని బస్టాపుల్లో బస్సుల కోసం వెయిట్చేయడం నరకమే...మనకు కావాల్సినప్పుడు మనం వెళ్లాల్సిన రూట్‌కు లైను కట్టి వచ్చే బస్సులు...అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక్కటీ కనిపించదు. గంటల తరబడి చూసినా వాటి జాడే ఉండదు. దీంతో కనెక్టింగ్బస్సులు పట్టుకుని వయా పోవాల్సి వస్తుంది. మరోవైపు సిటీ బస్సుల్లో కూడా చాలా మంది టైమ్ ప్రకారం జర్నీ చేసేవారున్నారు. లాంగ్ రూట్లలో వెళ్లే బస్సులు బస్సులు టైమ్ టు టైమ్ నడుస్తాయి. ట్రాఫిక్ వల్ల టైం కొద్ది నిమిషాలు ఇటు అటు అవుతుంది.
అయితే వీటిలో ప్రయాణించేవారు బస్సు మిస్ అవుతుందేమోనని బస్టాప్ లో పావుగంటల ముందే వచ్చి అరగంట ఆలస్యమైనా బస్సు వచ్చే వరకు వెయిట్చేస్తారు. ఇలా టైమింగ్ తెలియక ఇబ్బందులు పడేవారికి త్వరలో బల్దియా ప్రవేశపెట్టనున్న రియల్టైమ్ట్రావెల్డిస్ప్లే సిస్టమ్ఉపయోగపడనున్నది. బస్టాప్ కి వెళ్లే ముందే ఇంటి దగ్గర యాప్ఓపెన్చేసి చూసుకుంటే టెన్షన్ఉండదు. బస్సుల్లో స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా యాప్లేదా డిస్ ప్లే చూసుకుంటే చాలు.
అడ్వర్టైజ్మెంట్తో ఆదాయం కూడా..
కొత్త పద్ధతి ద్వారా జీహెచ్ఎంసీపై భారం పడకుండా పబ్లిక్ ప్రైవేట్పార్ట్ నర్(పీపీపీ)మోడ్ లో ఆపరేట్చేసేందుకు బల్దియా అడ్వర్టైజ్ మెంట్ విభాగం కసరత్తు చేస్తోంది. డిస్ప్లేల బాధ్యతలను టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించనున్నారు. స్క్రీన్ కింద, పై భాగంలో అడ్వర్టైజ్మెంట్లకుస్పేస్ ఉంటుంది. టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు ఆ స్పేస్ ని ప్రకటనల కోసం వినియోగించుకుంటాయి. దీని ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే స్క్రీన్లు, యాప్ మెయింటెనెన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఖర్చు అంతా ఆయా ఏజెన్సీలే భరించనున్నాయి. ఈ సిస్టం అందుబాటులోకి రాగానే జీహెచ్ఎంసీ మానిటరింగ్ చేస్తుంది. ఎక్కడైనా ఇబ్బందులుంటే సంబంధిత ఏజెన్సీతో పనులు చేయించనున్నారు.