ప్రభుత్వ సహకారంతో నగరాభివృద్ధి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ప్రభుత్వ సహకారంతో నగరాభివృద్ధి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

 హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, వెలుగు: నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నది మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.  బేగంపేట్ సర్కిల్ లో రూ. 59.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. మోండా మార్కెట్ డివిజన్​లో మూడు చోట్ల రూ.32.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, ఈస్ట్ మారేడ్ పల్లిలో రూ. 25.50 లక్షలతో వీడీసీసీ రోడ్డు, జీహెచ్ఎంసీ నర్సరీకి కార్బింగ్ అందించడం, ఈస్ట్ మారేడ్ పల్లిలో రూ. 1.40 లక్షలతో జీహెచ్ఎంసీ పార్కు-2 కాంపౌండ్ వాల్ రిపేర్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గత ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగు నెలల్లో జీహెచ్ఎంసీకి రూ.700 కోట్ల నిధులు విడుదల చేసిందని, అందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో అభివృద్ధి పనులకు గాను ప్రతి జోన్ కు రూ. 25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామన్నారు.