హైదరాబాద్ నగరాన్ని ఎంత క్లీన్ చేసిన చెత్త కుండి పాయింట్స్ తగ్గడం లేదన్నారు నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ప్రతి ఇంటింటికీ వెళ్లి చెత్త వెయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా, మార్పు పెద్దగా కనిపించడం లేదని చెప్పారు. ఉదయం 5 గంటలకు వచ్చి చేత కలెక్ట్ చేస్తున్నారని దాన్ని జనాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త కోసం బుట్టలు పంపిణీ చేస్తే.. వాటిని చెత్త కోసం కాకుండా ఇతర వస్తువులు పెట్టుకోవటానికి ఉపయోగిస్తున్నారని అది మానుకోవాలని కోరారు.
దోమలు పెరగకుండా నీళ్ళు నిలువు పెట్టకూడదని సూచించారు. స్వచదన్నం పచ్చదనంలో భాగంగా మొదటి రోజు - వ్యర్థాల తొలగింపు, రెండు రోజు- దోమల నిర్మూలన, మూడో రోజు- చెర్వులు సంరక్షించడం, నాలుగో రోజు- నాలాలు శుభ్రత,వాటర్ లాగింగ్ పాయింట్స్ తొలగింపు, ఐదో రోజు - గ్రెనరీ పెంచడం వంటి కార్యక్రమాలు చేపటామన్నారు. రోడ్ల మీద భవన నిర్మాణాల వ్యర్థాలు వేస్తే సీరియస్ గా ఫైన్ లు వేయాల్సి వస్తుందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.