డ్రగ్స్ ​వెనుక ఇంటర్నేషనల్​ మాఫియా

  • మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రుదేశాల కుట్ర
  • నీళ్లు, కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రింక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిపి అలవాటు చేస్తున్నరు
  • పార్టీలకు వెళ్లినప్పుడు అలర్ట్​గా ఉండండి
  • హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్​రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • బోయిన్​పల్లిలో 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు :  మన దేశ యువతను నిర్వీర్యం చేసేందుకు శత్రుదేశాలు కుట్ర చేస్తున్నాయని,  డ్రగ్స్​కు అలవాటు చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని హైదరాబాద్​ సిటీ పోలీస్​కమిషనర్ ​కొత్తకోట శ్రీనివాస్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లయ్ వెనుక ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాఫియా హస్తం ఉందని, వారు యూత్​ను డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసలుగా చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫెటమైన్ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఈ ముఠా నుంచి రూ.8.5 కోట్లు విలువ చేసే 8.5 కిలోల ఎఫెటమైన్​ డ్రగ్‌‌‌‌తోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన వీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.  

Also Read:-అప్పుడు బ్యాన్​..ఇప్పుడు బద్నామ్..వీ6, వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్

యువతను డ్రగ్స్‌‌‌‌ బానిసలుగా చేసేందుకు మాఫియా అనేక రకాల ప్లాన్లు వేస్తున్నదని, అందుకే  పార్టీలకు వెళ్లినప్పుడు తీసుకునే డ్రింక్స్‌‌‌‌పై అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తాగే నీళ్లు,  కూల్‌‌‌‌డ్రింగ్స్, ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌‌‌‌ కలిపి సప్లయ్‌‌‌‌ చేస్తున్నారని,  గతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయని తెలిపారు. డ్రగ్స్‌‌‌‌తో పట్టుపడిన వారిపై కన్స్యూమ్​మోతాదును బట్టి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

ఎఫిటమైన్​ స్వాధీనం  

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గతంలో పట్టుబడిన ఎఫిటమైన్​ డ్రగ్‌‌‌‌, అల్ర్పజోలం కేసులో హెచ్‌‌‌‌న్యూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో  నిందితుడు గోసుకొండ అంజిరెడ్డి ఇప్పటికే జైలులో ఉండగా.. అతడితో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేసిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అంజిరెడ్డి అరెస్ట్‌‌‌‌ కాక ముందు గుమ్మడిదలకు చెందిన కుంచల నాగరాజు(34)కు జూన్‌‌‌‌లో 8.5 కిలోల ఎఫిటమైన్​డ్రగ్‌‌‌‌ అందించినట్లు గుర్తించారు. 

అయితే, అంజిరెడ్డి అరెస్ట్ కావడంతో ఈ డ్రగ్స్‌‌‌‌ను ఎలాగైనా  విక్రయించి సొమ్ముచేసుకోవాలని నాగరాజు యత్నించాడు. క్యాబ్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ ఆశగౌరి వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌(32), మేడ్చల్ దుండిగల్‌‌‌‌కు చెందిన కుంటి శ్రీశైలం(42)తో కలిసి ఎఫిటమైన్ డ్రగ్‌‌‌‌ను సప్లయ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ముగ్గురు కలిసి డ్రగ్స్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేస్తుండగా బోయినపల్లి హెచ్‌‌‌‌న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ.8.5 కోట్లు విలువ చేసే 8.5 కిలోల ఎఫిటమైన్, కారు స్వాధీనం చేసుకున్నారు.