
సికింద్రాబాద్, వెలుగు : నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 30న సికింద్రాబాద్‌లోని కేజేఆర్ గార్డెన్స్ లో శనివారం ఉదయం 9 సాయంత్రం 5 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు డీసీపీ కల్‌మేశ్వర్ సింగెనవార్ తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమో చదివిన నిరుద్యోగ యువతకు అవకాశం కల్పి స్తున్నట్లు చెప్పా రు. ఇందులో ఫైనాన్స్, హెల్త్, ఫ్లిప్ కార్ట్, ఇన్సూరెన్స్ కంపెనీలు, చిన్న స్థాయి ఐటీకంపెనీలతో సహా మొత్తం 28 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. జీతం రూ. 8 వేల నుంచి రూ. 25 వేల వరకు అందిస్తాయన్నారు. అర్హులైన నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని డీసీపీ సూచించారు.