‘రన్ ఫర్ యాక్షన్’  పోస్టర్ విడుదల

 ‘రన్ ఫర్ యాక్షన్’  పోస్టర్ విడుదల

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్న ‘సిటీ పోలీస్ రన్ ఫర్ యాక్షన్ –2025’ పోస్టర్ ను మంగళవారం కమాండ్ ఆఫీస్​లో ఆయన రిలీజ్ చేశారు. 2కె, 5కె కేటగిరీల్లో ఆసక్తి ఉన్న మహిళలు https://rfa.bebetter.run లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు