చెరువులను తలపిస్తున్న నగర రోడ్లు.. వాహనదారుల ఇక్కట్లు

చెరువులను తలపిస్తున్న నగర రోడ్లు.. వాహనదారుల ఇక్కట్లు

నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర వాసులు గజగజ వణుకుతున్నారు. ఎటు చూసినా ప్రధాన కూడళ్లలో మోకాళ్ల వరకూ నీరు నిలిచిపోయాయి. సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నా.. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థుతులలో ముందుకు సాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

నగరంలో ఓ వాహనదారుడు వర్షపు నీటిని దాటే ప్రయత్నం చేయగా.. ప్రవాహం ధాటిగా బండితో సహా నీటిలో కొట్టుకుపోయాడు. సకాలంలో స్థానికులు అతన్ని కాపాడారు. అందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదొక్కటే అని కాదు, మహా నగరంలో పలు చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

భారీగా ట్రాఫిక్ జామ్ 

భారీ వర్షానికి తోడు గమ్యస్థాలాలకు త్వరగా చేరుకోవాలనే ఉద్దేశ్యంతో వాహనదారులు అడ్డగోలుగా తమ వాహనాలను నడుపుతున్నారు. దాంతో, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి.

వాహనాల రాకపోకలకు అంతరాయం

గండి మైసమ్మ చౌరస్తా నుండి నర్సాపూర్ వెళ్ళే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించాలని వాహనదారులు కోరారు.