
- సమ్మర్ ప్యాకేజీ ప్రకటించిన టూరిజం శాఖ
హైదరాబాద్ సిటీ, వెలుగు: సమ్మర్లో హైదరాబాద్ సిటీ టూర్ వేద్దామని ప్లాన్ చేసేవారికి టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని సిద్ధం చేసింది. హైదరాబాద్ సిటీ టూర్ పేరుతో రూ.380కి ఒక్కరోజులో సిటీని చుట్టేసే బంపర్ ఆఫర్ అందిస్తున్నది. ఇందులో భాగంగా నాన్ఏసీ, ఏసీ బస్సుల్లో బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ (నిజాం జూబ్లీ పెవిలియన్) , కుతుబ్షాహీ టూంబ్స్, నెహ్రూ జూపార్క్, లుంబినీ పార్క్ చూడొచ్చు. నాన్ ఏసీలో పెద్ద వారికి రూ.380, చిన్నారులకు రూ.300 టికెట్ ధర ఉంటుంది.
ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.400 ఉంటుంది. ఆయా చోట్ల ఎంట్రీ టికెట్, పుడ్ ఖర్చులు టూరిస్టులే భరించాల్సి ఉంటుంది. వివరాలకు https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour వెబ్ సైట్ ద్వారా లేదా 9848126947,836728585,9848540371 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.