శ్మశానవాటికలో చెత్త డంప్​ చేయొద్దు :హైడ్రా కమిషనర్ ​రంగనాథ్ 

శ్మశానవాటికలో చెత్త డంప్​ చేయొద్దు :హైడ్రా కమిషనర్ ​రంగనాథ్ 
  • డంప్​యార్డు కోసం రెండెకరాల స్థలం మాత్రమే ఉంది
  • హైడ్రా కమిషనర్ ​రంగనాథ్ 
  • మచ్చబొల్లారం హిందూ శ్మశానవాటిక పరిశీలన

అల్వాల్, వెలుగు: అల్వాల్ పరిధి మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశానవాటికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం సందర్శించారు. శ్మశానవాటికను డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలంలో రాంకీ సంస్థ చెత్త డంప్​చేయడం కరెక్ట్​కాదన్నారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మున్సిపల్​డిప్యూటీ కమిషనర్ కు సూచించారు.

డంపింగ్ యార్డ్ కోసం రెండెకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, 4 ఎకరాల్లో చెత్త డంప్​చేయడం సమంజసం కాదన్నారు. ఇక్కడి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. 24 రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్న విషయం మంత్రి శ్రీధర్​బాబు దృష్టికి వచ్చిందని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని తనతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితికి సూచించారన్నారు. ప్రస్తుతానికి నిర్మాణాలు ఆపాలని.. త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు.