హైదరాబాద్ లో రోడ్లు కనపడట్లేదు..ఓ పక్క చలి .. మరో పక్క పొగమంచు

 హైదరాబాద్ లో రోడ్లు కనపడట్లేదు..ఓ పక్క చలి .. మరో పక్క పొగమంచు

తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది.  చలి గాలులు  వీయడంతో  భారీగా పొగ మంచు అలుముకుంది. రోడ్లు .. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఏజన్సీ ఏరియాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.  వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ఉపరితల గాలులు తూర్పు ఈశాన్య దిశలో వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో  అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా 11 ఉష్ణోగ్రతలు నమోదయాయి..మరో రెండు రోజుల పాటు ( జనవరి 23 నుంచి)  కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే  అవకాశం ఉంది..

పొగ మంచు కారణంగా  హైదరాబాద్ లోని ప్రజలు ఉదయాన్నే పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.. ముఖ్యంగా వాహనదారులు.. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున ప్రారంభమైన పొగమంచు ఉదయం పదిన్నర గంటల వరకు ఉంటుంది. ఉదయాన్నే వాకింగ్ చేసే ప్రజలు మంచు ఉండడంతో మాస్క్ ధరించడంతో పాటు సూర్యోదయం అనంతరం చేస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని వైద్యులు సూచిస్తున్నారు..